భారతదేశం, జనవరి 25 -- భారత్, శ్రీలంక వేదికలుగా త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడం లేదు. ఇది ఇప్పుడు అఫీషియల్​ వార్త. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం తమ జాతీయ జట్టును భారత్‌కు పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించింది. అయితే ఇది టోర్నీ కన్నా బీసీబీకే ఎక్కువ నష్టాన్ని కలిగించేలా ఉంది! 2026 టీ20 వరల్డ్​ కప్​ ఆడకపోతే బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు భారీ మూల్యం చెల్లించుకోక తప్పేడట్టు లేదు.

కేవలం గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో పాల్గొనడం ద్వారా వచ్చే ఫీజుల రూపంలోనే బంగ్లాదేశ్ సుమారు 300,000 డాలర్ల నుంచి 500,000 డాలర్ల (సుమారు 3.6 నుంచి 6.7 కోట్ల బంగ్లాదేశ్ టాకాలు) నష్టపోయే అవకాశం ఉంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. 'సభ్యత్వ భాగస్వామ్య ఒప్పందం' (ఎంపీఏ) కింద, సరైన కారణం లేకుండా టోర్నీ కోసం ప్రయా...