తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 2 -- కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల భేటీ అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భేటీలో పాల్గొన్నది ఎవరనే అంశం పక్కనపెడితే. దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆహ్వానంతో కొందరు సమావేశయ్యారని.. మరోసారి కూడా భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కూడా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ఆయన.. ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు.

కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంటికి నేను వెళ్లినట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులపై అసమ్మతిగా ...