భారతదేశం, ఫిబ్రవరి 14 -- క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు వస్తాయని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి కృష్టి చేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్‌ కాంగ్రెస్‌పై ఉందని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో జరిగిన యువజన కాంగ్రెస్‌ నేతల ప్రమాణస్వీకార కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కామెంట్స్ చేశారు.

'పార్టీ కోసం పోరాడిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తాం. 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించాం. ప్రతి పేదవాడు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ బాధ్యత యూత్ కాంగ్రెస్‌పై ఉంది. వచ్చే స్...