భారతదేశం, మార్చి 9 -- సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను అధికారం నుంచి తొలగించిన తర్వాత అలవైట్ కమ్యూనిటీ పరిస్థితి చాలా భయానకంగా మారింది. ఒకప్పుడు అసద్ పాలన రక్షణలో ఉన్న ఈ సమాజం ఇప్పుడు అసద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు గ్రూపులు, సున్నీ ప్రజల టార్గెట్‌గా మారింది. ప్రతీకార దాడుల్లో ఇప్పటివరకు 1,000 మందికి పైగా మరణించారు, వీరిలో అలవైట్ వర్గానికి చెందిన వందలాది మంది ఉన్నారు. సిరియాలో 14 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ హింసాకాండ అత్యంత భయంకరమైన కాలంగా భావిస్తున్నారు.

బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్(ఎస్ఓహెచ్ఆర్) సంస్థ ప్రకారం.. ఇప్పటివరకు 745 మంది పౌరులు మరణించారు. వీరితో పాటు 125 మంది ప్రభుత్వ భద్రతా సిబ్బంది, 148 మంది అసద్ అనుకూల ఫైటర్లు కూడా హతమయ్యారు. ఈ ఘర్షణతో లత్కియా వంటి ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్ప...