భారతదేశం, ఏప్రిల్ 13 -- Sydney stabbing attack: ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలోని బోండి జంక్షన్ లో రద్దీగా ఉండే వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ సెంటర్ లో శనివారం ఉదయం కత్తితో ఒక దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తితో మాల్ లోని వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ దుండగుడి కత్తి దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు నిందితుల్లో ఒకరిని కాల్చిచంపారు. నిందితుడు ఒక్కరేనా? లేక ఎక్కువ మంది ఉన్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. కానీ, ఆ దుండగుడు ఒక్కడేనని పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో అతడు మరణించాడని, ఇకపై ఎలాంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు.

అధికారులు సిడ్నీలో కత్తి దాడి ఘటన జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ నుంచి దుకాణదారులను, వినియోగదారులను ఖాళీ చేయిస్తున్నారు. సాయుధ పోలీసుల బృందం ఇంకా ఎవరైనా నిందితులు మాల్ లో దాక్కుని ఉన్న...