Bengaluru, ఏప్రిల్ 6 -- హైబీపీ ఉండటం ఈ రోజుల్లో సాధారణమైన విషయమే. కానీ, దానిని నియంత్రణలో ఉంచుకోవాలి. ముఖ్యంగా వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంటుంది. దీని ప్రభావం శరీరంపై మరింత తీవ్రంగా పనిచేస్తుంది. సాధారణంగా గుండె ఆరోగ్యానికి మేలు చేసే స్విమ్మింగ్ వల్ల రక్త ప్రవాహం వేగం పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి ఉత్తమమైన వ్యాయామం. వేసవిలో ఎండ తాపం నుండి రక్షణ కోసం ఈత మంచిది. శరీరం చల్లబడటంతో పాటు, మంచి వ్యాయామం కూడా చేసినట్లవుతుంది. అయితే, వేసవిలో ఈత కొట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

కఠినమైన రక్తపోటు మార్పులు - అకస్మాత్తుగా చల్లని నీటిలోకి ప్రవేశించడం వల్ల రక్తనాళాలు సంకోచించవచ్చు. ఇది రక్తపోటులో కాసేపటి వరకూ పెరుగుదలకు దారితీస్తుంది.

డీహైడ్రేషన్ - వేడి వాతావరణం, దీర్ఘకాలిక ఈత డీ హైడ్రేష...