భారతదేశం, ఏప్రిల్ 26 -- Swiggy IPO: త్వరలో స్విగ్గీ ఐపీఓ రానుంది. బెంగళూరుకు చెందిన స్విగ్గీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (Swiggy IPO) కు వాటాదారులు ఆమోదం తెలిపారు. ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ వ్యాపారం నిర్వహించే స్విగ్గీ.. రూ.3,750 కోట్ల (450 మిలియన్ డాలర్లు) మూలధనంతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ ద్వారా రూ.6,664 కోట్ల (800 మిలియన్ డాలర్లు)ను సమీకరించాలని భావిస్తోంది.

ఐపీఓకు ముందు స్విగ్గీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారనుంది. 1 బిలియన్ డాలర్లను సమీకరించే యోచనలో ఉన్న స్విగ్గీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.750 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, స్విగ్గీ ఇంకా సెబీ (sebi) కి తన ఐపీఓ (Swiggy IPO) ఫైలింగ్స్ ను సమర్పించలేదు. ఏప్రిల్ 23న జరిగిన స్విగ్గీ అసాధారణ సర్వసభ్య సమావేశం (EGM)లో ఐపీఓకు అంగీకరిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని షేర్ హోల్డర...