Hyderabad, మార్చి 16 -- స్వీట్ ఇష్టపడని వారు చాలా అరుదు కదా. స్వీట్ తినే ప్రతి ఒక్కరికీ రబిడీ అంటే కచ్చితంగా ఇష్టం ఉంటుంది. అయితే ఒక్కో రబిడీ ఒక్కో టేస్ట్‌లో ఉంటుంది. స్వీట్ అంటే ఇష్టం ఉండి, ఒకవేళ ఇప్పటి వరకూ మీరు రబిడీ టేస్ట్ చేయకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. ఐస్ క్రీమ్‌, జ్యూస్‌ కలిపి తింటే వచ్చే ఫీలింగ్ రబిడీ తిన్నాక రావడం ఖాయం. దాని కోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి, ఇక్కడ ఇచ్చిన స్వీట్ పొటాటో (చిలకడ దుంప) రబిడీతో కొత్త టేస్ట్ ట్రై చేసేయండి.. మరింకెందుకు లేట్ రెసిపీ చూసేద్దాం రండి.

* 20 - నానబెట్టిన జీడిపప్పులు

* ½ కప్పు - కప్పు చిలకడ దుంప

* ½ + ½ కప్పుల నీరు

* 3 టేబుల్ స్పూన్లు బెల్లం పొడి

* ¼ టీ స్పూన్ యాలికుల పొడి

* 25 కుంకుమ పువ్వు రెబ్బలు, (నానబెట్టినవి)

* చిటికెడు ఉప్పు

* 5 బాదంపప్పులు, న...