Hyderabad, మే 8 -- Sweating Benefits: చెమట పెడితే ముఖానికి వేసిన మేకప్ పోతుందని బాధపడేవారు ఎంతోమంది. ఎక్కువమంది చెమట పట్టకూడదని కోరుకుంటారు. కొంతమందికి చెమట అధికంగా పట్టదు. నిజానికి శరీరానికి చెమటలు పట్టడం అనేది ఆరోగ్యానికి మేలే చేస్తుంది. చెమట పట్టడం అనేది శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియలో ముఖ్యమైనది. చెమట చర్మంపై ఉన్న స్వేద గ్రంధుల ద్వారా బయటికి స్రవిస్తుంది. అలా శ్రమించడం ద్వారా లోపల శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేడి ప్రాంతంలో నివసించే వారికి చెమట అధికంగా పట్టే అవకాశం ఉంది. చెమట ద్వారా ద్రవాలన్నీ బయటికి పోతాయి. కనుక వారు ఎక్కువగా నీరు త్రాగుతూ ఉండాలి.

వ్యాయామం చేసినప్పుడు శరీరం నిండా రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ఇది చర్మం లోపల నుండి ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు చెమట విపరీతంగా పడుతుంది. ఇలా చెమట పట్టడం వల్ల మ...