భారతదేశం, మార్చి 12 -- జాబ్ మార్కెట్‌లో కెరీర్ ఎదుగుదలకు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండటం చాలా ముఖ్యం. ఇంగ్లిష్‌ను మెరుగుపరిచే అనేక యాప్స్, వెబ్‌సైట్స్ ఉన్నాయి. SWAYAM పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ లెర్నింగ్ కోర్సులు చాలా ప్రాచుర్యం పొందాయి, ప్రభావవంతంగా ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిగా ఉచితం. అలాగే వివిధ అవసరాలు, స్థాయిలను బట్టి.. మీరు బేసిక్ నుండి ఇంగ్లిష్ నేర్చుకోవడం ప్రారంభిస్తే కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అడ్వాన్స్డ్ స్థాయి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే.. అన్ని కోర్సులు పోర్టల్లో దొరుకుతాయి. డైలీ లైఫ్, వర్క్ ప్లేస్, ఎంప్లాయిమెంట్, కమ్యూనికేషన్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కొరకు విభిన్న కోర్సులను మీరు ఇక్కడ చూడవచ్చు. swayam.gov.in పోర్టల్ ను సందర్శించడం ద్వారా మీరు ఈ కోర్సులను చేయవచ్చు.

ఈ కోర్సు ఆంగ్ల వ్యాకరణానికి ఒక ఆచరణాత్మక విధానం. ఇది ఆంగ...