భారతదేశం, మార్చి 13 -- Svsc Collections: మ‌హేష్‌బాబు, వెంక‌టేష్ హీరోలుగా న‌టించిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మూవీ రీ రిలీజ్‌లో అద‌ర‌గొట్టింది. టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన నాలుగో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మార్చి 7న ఈ సినిమా మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఆరు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మూవీ ఆరు కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. తొలిరోజు రెండు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కంచుకొని సంచ‌ల‌నం సృష్టించింది.

తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో మురారి 8.90 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ (8 కోట్లు), ఖుషి (7.50 కోట్ల‌)తో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆరు కోట్ల‌తో నాలుగో ప్లేస్‌లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ...