భారతదేశం, మార్చి 27 -- కోలీవుడ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ డీ3 తెలుగులోకి వ‌చ్చింది. వీ3 థ‌ర్డ్ కేస్ పేరుతో డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైంది. తెలుగులో ఫ్రీగా ఈ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వీ3 మూవీలో ప్ర‌జీన్‌, విద్యా ప్ర‌దీప్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. చార్లి, రాహుల్ మాధ‌వ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఈ మూవీ తెలుగులోకి వ‌చ్చింది. ఈ మూవీకి శ్రీజీత్ మ్యూజిక్ అందించాడు.

2023లో త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను రాసుకున్నాడు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్‌ను మెప్పించింది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ ప‌దికిగాను 5.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

విక్ర‌మ్ ఓ పోలీస్ ఆ...