భారతదేశం, సెప్టెంబర్ 13 -- అవినీతి కేసులో ఒక మంత్రికి శిక్ష విధించి చరిత్ర సృష్టించి.. కఠిన న్యాయమూర్తిగా పేరున్న సుశీలా కర్కీ నేపాల్‌కు తొలి మహిళా తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2016 జులైలో హిమాలయ దేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించిన ఆమె, ఇప్పుడు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 51 మంది ప్రాణాలు తీసి, ప్రభుత్వాన్ని కూలదోసిన హింసాత్మక నిరసనల మధ్య 73 ఏళ్ల సుశీలా కర్కీ ఈ కీలక బాధ్యతలను స్వీకరించారు.

ప్రస్తుత నిరసన ఉద్యమానికి 'జెన్ జెడ్' యువత నాయకత్వం వహిస్తోంది. వీరంతా సుశీలా కర్కీని తమ నాయకురాలిగా ఎంచుకోవడానికి గట్టిగా మద్దతు పలికారు. "కొద్ది కాలం పాటు దేశానికి నాయకత్వం వహించి, ఎన్నికలు నిర్వహించాలని వారు నాపై నమ్మకం ఉంచారు," అని ఆమె నేపాలీ మీడియాతో అన్నారు.

"ఆమె లాయర్‌గా ఉన్నప్పటి నుంచ...