భారతదేశం, ఏప్రిల్ 11 -- అది 2021 ఏప్రిల్ నెల.. కోదాడ పోలీస్ డివిజన్ మోతే పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకలపాటి తండా. ఆ తండాలో ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. ముక్కుపచ్చలారని కన్న కూతురును క్షుద్రపూజలకు బలి ఇచ్చింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలు సేకరించారు. వాటిని కోర్డుకు సమర్పించగా.. తాజాగా సూర్యాపేట జిల్లా కోర్టు నిందితురాలికి ఉరిశిక్ష విధించింది.

మేకలపాటి తండాలో నిందితురాలు బానోతు భారతి అలియాస్ లాస్య (32) నివసించేది. తనకున్న సర్పదోషాన్ని తొలగించుకునేందుకు.. క్షుద్ర పూజలు చేయించుకుంది. అందుకు తన కన్నకూతురును నరబలిగా ఇచ్చింది. 7 నెలల వయస్సున్న తన కూతురును లాస్య దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు వచ్చింది.

ఫిర్యాదు వచ్చిన వెంటనే అప్పటి మో...