New Delhi, నవంబర్ 29 -- Suryakumar on his favourite T20 innings: సూర్యకుమార్‌ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ టీ20 క్రికెట్‌లో మేటి బ్యాటర్. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. అతడు ఇండియా తరపున టీ20 అరంగేట్రం చేసి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు కానీ పెద్ద సెన్సేషన్‌గా నిలిచాడు. ఈ మధ్యే ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో 239 రన్స్‌తో మూడో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

ఇప్పటి వరకూ ఇండియా తరఫున 57 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 1800 రన్స్‌ చేశాడు. అందులో రెండు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌ కూడా ఆడాడు. అయితే తన ఫేవరెట్‌ టీ20 ఇన్నింగ్స్ గురించి అడిగినప్పుడు అతడు రెండు ఇన్నింగ్స్‌ గురించి చెప్పాడు. ఈఎస్పీఎన్‌ క్రికిన్ఫో 25 కొశన్స్‌ సిరీస్‌లో మాట్లాడుతూ.. తన తొలి హాఫ్‌ సెంచరీతోపాటు ఐపీఎల్‌లో చెన్నైపై...