భారతదేశం, మార్చి 22 -- మలయాళ ఇండస్ట్రీ నుంచి సర్వైవల్ థ్రిల్లర్ జానర్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ సక్సెస్ సాధించటంతో పాటు చాలా పాపులర్ అయ్యాయి. ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేసి మెప్పించాయి. కలెక్షన్లలో దుమ్మురేపాయి. వాటిలో ఐదు మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి. ఈ సినిమాలను ఇంకా చూడపోతే తప్పకుండా ట్రై చేయవచ్చు. అవేవంటే..

సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం మంజుమ్మల్ బాయ్స్ భారీ హిట్ సాధించింది. మలయాళ ఇండస్ట్రీలో రూ.200కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా నిలిచింది. గతేడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. ప్రమాదకరమైన లోతైన గుహలో పడిపోయిన స్నేహితుడిని కాపాడుకునేందుకు కొందరు యువకులు చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సాగుతుంది. డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన ముంజుమ్మల్ బాయ్స్ ఉత్కంఠభరితంగ...