భారతదేశం, ఫిబ్రవరి 23 -- Survival Thriller OTT: మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ రాస్తా స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ఆదివారం నుంచి మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మ‌ల‌యాళం మూవీలో స‌ర్జానో ఖ‌లీద్‌, అన‌ఘా నారాయ‌ణ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. టీజీ ర‌వి, ఆరాధ్య అన్, ఇర్షాద్ అలీ కీల‌క పాత్ర‌ల్లోన‌టించాడు. రాస్తా మూవీకి అనీష్ అన్వ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈ ఏడాది జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టించిన ఆడు జీవితం మూవీకి కాన్సెప్ట్ ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో రాస్తా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.

మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు స‌ర్వైవ‌ల్ ఎలిమెంట్స్ జోడించి ద‌ర్శ‌కుడు అనీష్ అన్వ‌ర్ రాస్తా మూవీని తెర‌కెక్కించాడు. స‌హానా త‌ల్లి బ‌తుకుతెరువు కోసం దుబాయ్‌కి వ‌స్తుం...