భారతదేశం, జూన్ 25 -- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, రైతులకు ఇచ్చిన హామీలు ఇంకా కాగితాల్లోనే మిగిలిపోవడంతో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తీవ్ర నిరాశ, నిట్టూర్పులతో అలమటిస్తోంది! వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యాన్ని బట్టి చంద్రబాబు మునుపటి వైఖరి మారలేదనే స్పష్టమౌతోంది. కూటమిలో తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీలు చేరి ఇచ్చిన ఎన్నికల ఉమ్మడి హామీల అమలుకూ రైతాంగం నోచుకోవడం లేదు. హామీల మేరకైనా వ్యవసాయ సమస్యల్ని తీర్చి చరిత్ర గతిని మారుస్తారా? ఇదే నిర్లక్ష్యం కొనసాగించి చరిత్రహీనులుగా మిగులుతారా? అని ఏపీ రైతాంగం ప్రశ్నిస్తోంది.

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 'పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ' నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో రైతుల ఆవేదన, అసంతఅప్తి, ఆగ్రహం స్పష్టంగా వెల్లడైంది. ఇచ్చాపురం నుంచి...