భారతదేశం, మార్చి 4 -- దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పాపులర్ యాక్టర్ సూర్య. కథల ఎంపికలోనూ వైవిధ్యం కనబరిచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి, అంతకుమించిన స్థాయిలో నిలిచారు. తన సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా మారాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన కంగువా సినిమాలో చక్కటి నటనతోనే కాకుండా ఇంప్రెసివ్ ఫిజిక్‌తో ఆకట్టుకున్నాడు. దీనికి కారణం సూర్య ఫాలో అయిన స్ట్రిక్ట్ డైట్ ఏ నని తెలిసిన వారెవరైనా చెప్తారు. స్వయంగా సూర్య ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

"49 ఏళ్ల వయస్సులో ఇది సాధించడం సాధారణమైన విషయం కాదు. మెటబాలిజం తగ్గిపోతుంది. కానీ, ఇది సహజంగానే సాధించాలనుకున్నా. దీని కోసం 100 రోజుల డైట్ ప్లాన్ ఫాలో అయ్యా. కార్డియో వర్కౌట్స్ చేయడం కోసం కేలరీల కొరత లేకుండా చూసుకున్నా. పూర్తి డెడికేషన్‌తో సహజమైన పోష...