భారతదేశం, ఫిబ్రవరి 22 -- Suriya Sister: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ సినీ నేప‌థ్య‌మున్న‌వారే. సూర్య తండ్రి శివ‌కుమార్ 1980 -90 ద‌శ‌కంలో త‌మిళంలో అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు. శివ‌కుమార్ బాట‌లోనే ఆయ‌న త‌న‌యులు సూర్య‌, కార్తి యాక్టింగ్‌వైపు అడుగులు వేశారు. ప్ర‌స్తుతం సూర్య పాన్ ఇండియ‌న్ హీరోగా ఇమేజ్‌ను సొంతం చేసుకోగా...డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు చేస్తూ వెర్స‌టైల్ హీరోగా కార్తి కొన‌సాగుతోన్నాడు. సూర్య భార్య జ్యోతిక కూడా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాలు చేసింది.

శివ‌కుమార్‌కు సూర్య‌, కార్తి మాత్ర‌మే కాకుండా బృంద అనే కూతురు కూడా ఉంది. అన్న‌య్య‌ల బాట‌లోనే బృంద‌ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. యాక్ట‌ర్‌గా కాదు సింగ‌ర్‌గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. అయితే అన్న‌య్య‌ల మా...