భారతదేశం, ఫిబ్రవరి 4 -- Suriya Father: కోలీవుడ్‌లో అగ్ర క‌థానాయ‌కులుగా కొన‌సాగుతోన్నారు సూర్య‌, కార్తీ. పాన్ ఇండియ‌న్ సినిమాల‌తో సూర్య స‌త్తా చాటుతోండ‌గా, డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌ను ఎంచుకుంటూ కార్తీ విజ‌యాల్ని అందుకుంటోన్నాడు. సూర్య‌, కార్తీ తండ్రి శివ‌కుమార్ కూడా 1970-80 ద‌శ‌కంలో త‌మిళంలో గొప్ప న‌టుల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు.

న‌ల‌భై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో 200ల‌కుపైగా త‌మిళ సినిమాలు చేశారు శివ‌కుమార్‌. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాల్ని అందుకున్నాడు. కే బాల‌చంద‌ర్‌, ఐవి శ‌శి, మ‌ణివ‌ణ్ణ‌న్ వంటి అగ్ర ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేశాడు శివ‌కుమార్‌. కే బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సింధు భైర‌వి, అగ్ని సాక్షి సినిమాల్లో విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు.

సినిమాలు మాత్ర‌మే కాకుండా సీరియ‌...