హైదరాబాద్,తెలంగాణ, ఏప్రిల్ 3 -- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లకొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపేయాలని స్పష్టం చేసింది. ఈ భూములపై దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదిక పరిశీలించింది.

గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. ఇది చాలా సీరియస్ విషయమంటూ వ్యాఖ్యానించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రభుత్వ చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

"మీకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? ఇది చాలా తీవ్రమైన విషయం. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు. మేము సుమోటోగా కేసు తీసుకున్నాం. మధ్యంతర నివేదిక...