భారతదేశం, మార్చి 6 -- సనాతన ధర్మంపై తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తమ అనుమతి లేకుండా ఉదయనిధిపై కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. ఒకే అంశంపై అనేక ఫిర్యాదులు దాఖలు చేయలేమని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న ఎఫ్ఐఆర్‌లను విచారించే కోర్టుల్లో స్టాలిన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు పొడిగించింది. కరోనా, మలేరియా, డెంగ్యూలను నిర్మూలించిన విధంగానే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా దాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ ఒక కార్యక్రమంలో కామెంట్స్ చేశారు.

అన్ని ఎఫ్ఐఆర్‌లను కలిపి ఫిర్యాదులను ఒకే చోటకు బదిలీ చేయాలని స్టాలిన్ దాఖలు చేసిన ప...