ఆంధ్రప్రదేశ్‌, నవంబర్ 28 -- Supreme Court అమరావతి రాజధాని నిర్మాణంపై ఏపీ హైకోర్టు గత మార్చి 3న ఇచ్చిన తీర్పులో పలు అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆర్నెల్ల లోపు రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే నిబంధన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. అదే సమయంలో ల్యాండ్ పూలింగ్ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు విచారణను వచ్చే ఏడాది జనవరి 31కు వాయిదా వేసింది.

రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే లభించింది. ఆరు నెలల్లో రాజధానిని పూర్తి చేయాలనడం సరికాదని అభిప్రాయపడింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? అని ప్రశ్నించిన స...