భారతదేశం, ఏప్రిల్ 3 -- Supreme court: పశ్చిమ బెగాల్ లో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 25,753 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలు చెల్లవని కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ధ్రువీకరిస్తూ 2025 ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామక ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని, అందువల్ల ఈ నియామకాలను రద్దు చేస్తున్నట్లు గతంలో కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 2024లో తీర్పునిచ్చింది.

నియామక ప్రక్రియ ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చింది. నియామక ప్రక్రియలో అవకతవకలు నియామకాల సమగ్రతకు భంగం కలిగించాయని, వాటిని కొనసాగించలేమని కోర్టు తన తీర్పుల...