భారతదేశం, ఏప్రిల్ 12 -- Supreme Court: రాష్ట్రాల గవర్నర్లు తన పరిశీలనకు పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి పాటించాల్సిన విధి విధానాలను సుప్రీంకోర్టు వివరించింది. గవర్నర్ ఆ బిల్లును పంపిన తేదీ నుంచి మూడు నెలల్లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మూడు నెలల్లోపు ఆ బిల్లును ఆమోదించడం కానీ, తిరస్కరించి, పున: పరిశీలనకు పంపించడం కానీ చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకుంటున్నట్లుగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 8న 415 పేజీల తీర్పులో తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి నిలిపివేసి రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసిన 10 బిల్లులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద...