భారతదేశం, మార్చి 26 -- Allahabad high court: వక్షోజాలను పట్టుకోవడం లేదా పైజామాను తొలగించాలని ప్రయత్నించడం వంటి చర్యలు అత్యాచార యత్నంగా పరిగణించలేమని, అత్యాచార నిందితుడిపై అభియోగాలను నిరూపించడానికి ప్రాసిక్యూషన్ ఈ "సన్నద్ధత దశ" దాటి వెళ్లాలని సూచిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. అలహాబాద్ హైకోర్టు మార్చి 17న ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ 'వి ది ఉమెన్ ఆఫ్ ఇండియా' అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఏ మాత్రం సున్నితత్వం లేనిదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'తీర్పు రాసిన వ్యక్తి సున్నితత్వ లోపానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.