Hyderabad, మార్చి 26 -- మీ చర్మం ఆరోగ్యం మీరు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారాలు మీ అందాన్ని, చర్మారోగ్యాన్ని పెంచి సహజ కాంతినిస్తాయి. అలాగే కొన్ని ఆహారాలు మొటిమలు, మచ్చలు వంటి అనేక రకాల చర్మ సమస్యలకు కారణమవుతాయి. ఏదేమైనా మీ ఆహారాపు అలవాట్లు, అభిరుచులు మీ చర్మం మీద చాలా ప్రభావం చూపిస్తాయన్నది వాస్తవం. కాబట్టి మీ చర్మం రకాన్ని, సమస్యని బట్టి మీకు సరైన ఆహారం ఏదో తెలుసుకోవాల్సిన అవసరం మీకు చాలా ఉంది.

ఎందుకంటే సమస్య తెలిస్తేనే దానికి తగిన పరిష్కారాన్ని కనుగొనచ్చు. మీ చర్మ రకం వేరే అయి ఉండి మీరు అందంగా ఉండటం కోసం వేరే డైట్ ను ఫాలో అవుతుంటే అది వృథా అవచ్చు. అలాగే మొటిమల పొగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అందుకు తగిన ఆహారాన్ని ఎంచుకోకపోతే అవి తగ్గకపోవచ్చు. ఇలా జరగకూడదు అంటే మీ చర్మం రకం ఏంటో తెలుసుకోండి. దాన్ని బట్టి మీకు ఎలాంటి ...