Hyderabad, మార్చి 21 -- Mohanlal About L2 Empuraan At Trailer Release In Imax Format: మలయాళ సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన భారీ చిత్రం 'L2E: ఎంపురాన్'. ఎల్2 ఎంపురాన్ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.

ముర‌ళీ గోపి క‌థ‌ను అందించిన ఎల్2 ఎంపురాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో గురువారం ఎల్2 ఎంపురాన్ సినిమా ట్రైలర్‌ను ఐమ్యాక్స్ ఫార్మేట్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోహన్ లాల్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.

సూపర్ స్టార్ మోహన్ లాల్ మాట్లాడుతూ.. "L2E: ఎంపురాన్ జర్నీ అనేది మరచిపోలేని అనుభవం. ఇలాంటి ...