Hyderabad, మార్చి 7 -- ప్రజలు తమ చర్మ ఆరోగ్యం విషయంలో మరింత స్పృహ పెంచుకుంటున్నారు. అందుకే ఈ రోజుల్లో సన్‌స్క్రీన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇది అన్ని రకాల చర్మం కలిగిన వారికి అనువైనది. అలాగే చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా చాలా ముఖ్యమైన పదార్థం అని సౌందర్య నిపుణులు కచ్చితంగా చెబుతున్నారు. ముఖ్యంగా బయటికి వెళ్లేటప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ రాసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే..

సన్‌స్క్రీన్ లోషన్ సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని కాపాడటానికి, అనక చర్మ వ్మాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. రోజులో కనీసం రెండు సార్లైనా చర్మానికి సన్‌స్క్రీన్ తప్పక రాయడం వల్ల చర్మం కాంతివంతంగా, మెరుస్తూ కనిపిస్తుంది. చర్మం పొడి బారడం, తేమను కోల్పోవడం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. సన్‌స్క్రీన్ లోషన్ ను రెగ్యులర్ స్కిన్ కూర్ రోటీ...