Hyderabad, మార్చి 25 -- Sunny Deol: మరో బాలీవుడ్ ప్రముఖుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి గొప్పగా చెబుతున్నాడు. తాను కూడా ముంబైని వదిలి సౌత్ లో సెటిలవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పడం విశేషం. అతని పేరు సన్నీ డియోల్. ఈ మధ్యే డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ముంబైని వదిలి సౌత్ సినిమా కోసం వచ్చేసిన విషయం తెలిసిందే.

పుష్పలాంటి మూవీని తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సన్నీ డియోల్ నటిస్తున్న జాట్ మూవీ రాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ సోమవారం (మార్చి 24) రిలీజైంది. ఈ సందర్భంగా సౌత్ సినిమా ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించిన సన్నీ డియోల్.. తాను కూడా సౌత్ లో సెటిలవ్వాలని భావిస్తున్నట్లు చెప్పడం విశేషం.

"బాంబే ప్రొడ్యూసర్లు వీళ్లను చూసి నేర్చుకోవాలి. మీరు బాలీవుడ్ అని పిలుస్తారు. కానీ అది హిందీ సినిమా. ప్రేమతో ఎలా సినిమాలు చేయాలో వీళ్లను చూసి నేర్...