Hyderabad, ఫిబ్రవరి 28 -- నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రెండు సార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్ర ముగించుకొని తిరిగి వచ్చారు. మూడోసారి తిరిగి భూమికు రాబోతున్నారు కూడా. తన సహచరుడు బుచ్ విల్మోర్‌తో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లి తొమ్మిది నెలలకు పైగా అంతరిక్షంలోనే గడిపారు. వారి బోయింగ్ స్టార్‌లైనర్ కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత అనేక సాంకేతిక సమస్యలను ఎదుర్కోవడంతో 2024 జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో ఆగిపోయారు. తాజా సమాచారం ప్రకారం, మార్చి 2025 నెల మధ్యలో వస్తున్నట్లుగా అనౌన్స్‌మెంట్ వచ్చింది.

ఐఎస్ఎస్‌లో వ్యోమగాముల ఆగిపోవడం వలన బరువు తగ్గిపోయి డం గురించి ఆందోళనకరమైన నివేదికలు వచ్చాయి. ఫిబ్రవరిలో, నాసా వారిని స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌లో భూమికి తీసుకురావాలని ప్రణాళ...