భారతదేశం, జనవరి 23 -- అంతరిక్ష పరిశోధనల చరిత్రలో తనకంటూ కొన్ని సువర్ణ పేజీలను లిఖించుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు 27 ఏళ్ల పాటు నాసాలో విశేష సేవలు అందించిన ఆమె.. 2025 డిసెంబర్ 27న అధికారికంగా పదవీ విరమణ చేశారు. మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో అత్యంత విజయవంతమైన వ్యోమగాముల్లో ఒకరిగా ఆమె తన ప్రస్థానాన్ని ముగించారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో సునీతా విలియమ్స్ మూడు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్​ఎస్​) వెళ్లారు. అక్కడ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు.

యూఎస్ నేవల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్‌లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన ఆమె.. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. అంతకుము...