భారతదేశం, మార్చి 13 -- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక నెలల పాటు చిక్కుకుపోయి, ఇంకొన్ని రోజుల్లో భూమికి తిరిగి రావాల్సిన వ్యోమగాములు సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లకు మరో షాక్​! వారిని భూమికి తిసుకొచ్చేందుకు బయలుదేరాల్సిన స్పేస్​ఎక్స్​ మిషన్​.. చివరి నిమిషంలో ఆగిపోయింది. రాకెట్ లాంచ్​ప్యాడ్​లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బుధవారం క్రూ-10 ప్రయోగాన్ని వాయిదా వేసింది స్పేస్​ఎక్స్.

బోయింగ్​కు చెందిన స్టార్​లైనర్​లో ప్రయాణించిన తర్వాత వ్యోమగాములు సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ప్లాన్​ ప్రకారం.. అనుభవజ్ఞులైన అయిన వ్యోమగాములు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఐఎస్ఎస్​లో ఉండాలి. కానీ ఇప్పుడు 9 నెలలు దాటేసింది. వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్​కు చెందిన స్టార్...