భారతదేశం, మార్చి 9 -- భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే తేదీ దగ్గర పడుతోంది. పది రోజుల తర్వాత సునీతా విలియమ్స్ తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి స్పేస్ ఎక్స్ డ్రాగన్‌లో తిరిగి వస్తారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. గత 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వ్యోమగాములు చిక్కుకుపోయారు. మంచి విషయం ఏంటంటే ఇద్దరు బాగానే ఉన్నారు. గతంలో ఆమె ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ ఫోటోల్లో చాలా సన్నగా కనిపించారు. ఆరోగ్యం క్షీణించినప్పటికీ సునీతా విలియమ్స్ ఈ ఎనిమిది నెలల్లో రెండు ప్రత్యేకమైన రికార్డులను నెలకొల్పారు.

వరుసగా ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు సునీతా విలియమ్స్. చాలా నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో...