భారతదేశం, మార్చి 19 -- Sunita Williams: వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష మిషన్ ను ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా స్టాక్ మార్కెట్ పెట్టుబడితో పోల్చారు. 8 రోజుల్లో తిరిగిరావాల్సిన సునీతా విలియమ్స్ అనూహ్య పరిస్థితుల మధ్య దాదాపు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. చివరకు, బుధవారం ఉదయం సురక్షితంగా భూమిపైకి వచ్చారు.

ఈ నేపథ్యంలో, స్పేస్ లో అన్ని రోజులు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండగలగడం వల్లనే ఆమె భూమికి విజయవంతంగా తిరిగి రాగలిగారని, అదే విధంగా, స్టాక్ మార్కెట్లో విజయం సాధించాలంటే అనూహ్య పరిస్థితులను తట్టుకునే సామర్ధ్యం, సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, ఓపికగా ఎదురు చూడగల తత్వం ఉండాలని విజయ్ కేడియా సూచిస్తున్నారు. ఈ రెండు రంగాలలో కూడా విజయానికి కీలకమైనది దీర్ఘకాలిక ప్రణాళిక, స్మార్ట్ నిర్ణయాలు తీసుకోవడం, అనూహ్య మార్పులను ...