భారతదేశం, ఫిబ్రవరి 14 -- Sunita Williams: గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ తొలుత ఊహించిన దానికంటే ముందుగానే భూమికి తిరిగి రావచ్చని నాసా ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ వరకు కాకుండా మార్చి మధ్య వరకు వీరిద్దరు భూమికి తిరిగి వస్తారని అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. వ్యోమగాముల పునరాగమనాన్ని వేగవంతం చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల ఇచ్చిన హామీల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

రాబోయే వ్యోమగాముల కోసం క్యాప్సూల్స్ ను మార్చాలని నాసా, స్పేస్ఎక్స్ మొదట నిర్ణయించాయి. కానీ ఆ తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. గత వారంతో సునీత విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకుని ఎనిమిది ...