Hyderabad, మార్చి 18 -- సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలు జీవించింది. ఆమె మరొక వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి ఈరోజు భూమికి తిరిగి రాబోతోంది. ఆమె రాక కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. భూమ్మీదకు వచ్చాక వారి జీవితం సాధారణంగా ఉండదు.

వారం రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండేందుకు వెళ్లిన సునీత విలియమ్స్ అనుకోని పరిణామాల వల్ల తొమ్మిది నెలల పాటు ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె తిరిగి భూమి మీదకు చేరుకుంటుంది. అంతరిక్షంలో ఎక్కువ సమయం గడపడం వల్ల భూమి మీదకు చేరుకున్నాక ఆమెకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

అంతరిక్ష కేంద్రంలో కొన్ని నెలల పాటు నివసించడం వల్ల మానవ శరీరం, మనసుపై తీవ్ర ప్రభావాలు పడతాయి. ఎముక సాంద్రత, కండర ద్రవ్యరాశి, దృష్టి , మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం తప్పదు. మీరు భూమి మీదకు చేరుకున్న ...