భారతదేశం, మార్చి 7 -- ఫుట్‌బాల్‌ దిగ్గజం సునీల్ ఛెత్రి రిటైర్మంట్ పై యూటర్న్ తీసుకున్నాడు. 40 ఏళ్ల వయసులో తిరిగి ఫుట్‌బాల్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇండియాలో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లే లేరన్నంటూ.. మళ్లీ ఛెత్రిని టీమ్ లోకి తీసుకోవాల్సిన దుస్థితిపై క్రీడా పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఛెత్రి రాక సంతోషాన్ని ఇచ్చేదే అయినా.. ఈ వయసులోనూ అతని అవసరం జట్టుకు ఉండటం యువ ఆటగాళ్ల నైపుణ్యాలపై సందేహాలకు కారణమవుతోంది.

2024 లో సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. కన్నీరు నిండిన కళ్లతో మైదానం వీడాడు. అప్పుడు మళ్లీ అతను జట్టులోకి వస్తాడనే అంచనాలే లేవు. అతని వయసే అందుకు కారణం. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఛెత్రి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏఎఫ్ సీ ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్ లో భాగంగా బంగ్లాదేశ్ తో భారత్ మ్యాచ్ లో ఛ...