భారతదేశం, ఫిబ్రవరి 27 -- తమిళ సినీ ఇండస్ట్రీ కోలీవుడ్‍కు ఇంకా రూ.1000కోట్ల కలెక్షన్ల మూవీ కల నెరవేరలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నాలుగు చిత్రాలు ఇప్పటికే ఆ మార్క్ దాటేశాయి. కన్నడలోనూ కేజీఎఫ్ 2 ఈ మైల్‍స్టోన్ సాధించింది. కోలీవుడ్ మాత్రం వేచిచూస్తోంది. అయితే, రూ.1000 కోట్లు సాధించే తొలి మూవీగా నిలిచే సత్తా ఉన్న చిత్రమేదో తెలుగు హీరో సందీప్ కిషన్ తాజాగా అంచనా వేశారు. సందీప్ హీరోగా నటించిన తెలుగు మూవీ మజాకా బుధవారం విడుదల కాగా.. నేడు గురువారం (ఫిబ్రవరి 27) సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఓ తమిళ భారీ చిత్రంపై వచ్చిన ఓ ప్రశ్నకు సందీప్ రియాక్ట్ అయ్యారు.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా రూ.1000కోట...