Hyderabad, ఫిబ్రవరి 25 -- Sundeep Kishan Anil Sunkara On R Narayana Murthy People Star Tagline: తెలుగులో పలు విప్లవాత్మక సినిమాలు తెరకెక్కించిన నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తిని అభిమానులు ముద్దుగా పీపుల్స్ స్టార్ అని పిలుచుకుంటారు. ఆయన ప్రజల కోసం ఎన్నో సినిమాలు చిత్రీకరించారు. అందుకే పీపుల్స్ స్టార్ అనే బిరుదుతో ఆర్ నారాయణ మూర్తిని గౌరవంగా పిలుస్తారు.

అయితే, ఇటీవల యంగ్ హీరో సందీప్ కిషన్‌కు ఈ పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ లైన్‌ను వాడుతున్నారు మేకర్స్. సందీప్ కిషన్ సినీ కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కుతోన్న మూవీ మజాకా. ఈ మూవీ టైటిల్స్, ప్రెస్ నోట్స్‌లలో సందీప్ కిషన్‌ను పీపుల్స్ స్టార్ అంటూ రాసుకొస్తున్నారు.

ఈ విషయంపై ఇటీవల మజాకా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సందీప్ కిషన్‌ను అలా ఎందుకు పిలిపించుకుంటున్నారు అని మీడియా అడిగింది. దీనిపై ప్రముఖ నిర్మ...