Hyderabad, ఏప్రిల్ 28 -- Sunday Motivation: ఉదయం నిద్ర లేచాక మీరు మొదట ఏమి చేస్తారు? ఫోన్ చూడడం, సోషల్ మీడియా ఖాతాలను తెరవడం వంటివి చేస్తే ఆ రోజంతా మీకు గజిబిజిగానే ఉంటుంది. మీకు రోజంతా ప్రశాంతంగా సాగాలంటే ఆధ్యాత్మిక పద్ధతిలో మీ ఉదయాన్నే ప్రారంభించాలి. జీవితం చాలా బిజీగా సాగిపోతుంది. మీరు ప్రశాంతంగా ఉండగలిగే సమయం నిద్ర లేచిన వెంటనే దొరికే ఆ కాసేపే. ఉదయం పూట కొన్ని రకాల పనులను చేయండి. ఇవి ఆధ్యాత్మిక స్వభావాన్ని పెంచడంతోపాటు ఆ రోజంతా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.

ఉదయం లేచిన వెంటనే ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియా ఖాతాలు వంటివి చెక్ చేయడం మానేయండి. కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. పావు గంట సేపు ధ్యానం చేయండి. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకుంటే మంచిది. ఒక సౌకర్యవంతమైన స్థలంలో కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టండి. ఏ ఆలోచనలను పెట్టుకోకండి. శ...