Hyderabad, మార్చి 30 -- చదువులో వెనుకబడటం, ఆఫీసు పనిలో విఫలం కావడం, ఇతరులకన్నా తక్కువ స్థాయిలో ఉండటం వంటి రకరకాాల ఆలోచనలు, భయాలు అందరి జీవితాల్లోనూ ఉండే నెగటివ్‌ ఆలోచనలు. జర్నల్ ఆఫ్ సైకాలజికల్ రిసెర్చ్ ప్రకారం మనిషిలో ఆలోచనల్లో దాదాపు 80% నెగటివ్‌గానే ఉంటాయట. ఈ ఆలోచనలు జీవితంలోని ముఖ్యమైన అంశాలైన సంబంధాలు, పని, పాఠశాలలపై ఆధారపడి ఉంటాయట. వీటిలో చాలావరకు ఇతరులు చెప్పిన మాటలపై అంటే చెప్పుడు మాటల మీదే ఆధారపడి ఉంటాయట.

నిజానికి రోజువారీ జీవితంలో అంటే మనం మన ఇంట్లో, బయటా, ఆఫీసులో చాలా మంది నెగటివ్‌గా మాట్లాడే, నెగటివ్‌గా ప్రవర్తించే వ్యక్తులను ఎదుర్కోవలసి వస్తుంది. వారి నెగిటివిటీ ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే, వారందరితో కలిసి ఉంటూనే వారి నెగిటివిటీకి దూరంగా ఉండాలంటే, పాజిటివ్ ఆలోచనలతోనే జీవించాలంటే ఏం చేయాలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకు...