Hyderabad, మార్చి 23 -- మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా.. లేక సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారా? ఒక క్షణం ఆగి ప్రశాంతంగా ఆలోచించుకోండి. ఎందుకంటే చాలా మంది బయటికి సంతోషంగా కనిపిస్తారు కానీ లోపల బాధపడతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ దాన్ని మర్చిపోవాలి, బాధ నుంచి బయటపడి సంతోషాన్ని వెతుక్కోవాలి.

కొంతమందికి ఎప్పుడూ బాధపడుతూ ఉండటం, నిరాశతో జీవించడం అలవాటైపోయింది. నిజానికి ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే స్వీయ సంతోషం ఉంటేనే ఏదైనా సాధించగలరు. అంటే మీపై మీకు నమ్మకం ఉండాలి, మీరంటే మీరు ఒక సంతృప్తి ఉండాలి, మిమ్మల్ని తలచుకుని మీరు సంతోషించాలి, గర్వించాలి. ఇలాంటప్పుడు దేన్నైనా సాధించగలుగుతారు. ఎన్ని యుద్దాలైనా గెలుస్తారు. సంతోషంగా జీవిస్తారు. సంతోషం అనేది ప్రత్యేకంగా మిమ్మల్ని వెతుక్కుంటూ రాదు.. దానికి మీరే స్వయంగా సొంతం చేసుకోవా...