భారతదేశం, జనవరి 22 -- గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకొస్తుంది. కొన్ని సార్లు గ్రహాల సంచార మార్పుల వల్ల శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలకు రాజైన సూర్యుడు కూడా తన రాశులను మారుస్తూ ఉంటాడు.

ప్రతి నెలా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా నెలకు ఒకసారి సూర్యుడు తన రాశి మార్పు చేస్తాడు. సూర్యుడిని విశ్వాసం, శక్తి, గౌరవం, నాయకత్వానికి పితామహుడిగా భావిస్తారు. సూర్యుని సంచారం మేష రాశి నుంచి మీన రాశి వరకు అన్ని రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుని మారుతున్న కదలికలు జీవితంలో పెద్ద మార్పులను తీసుకొస్తాయి.

హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే, ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభ రాశిలో సంచారాన...