Hyderabad, మార్చి 20 -- మార్చి నెల నుంచి ఎండలు మండిపోతున్నాయి. వేసవి సెగలు తగిలేస్తున్నాయి. కాబట్టి మీరు భోజనంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాలానుగుణంగా కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం దక్కుతుంది. వేసవిలో దొరికే కూరగాయలు పోషకాలతో నిండి ఉంటాయి. అలాగే మన శరీరాన్ని హైడ్రేటింగ్ గా ఉంచుతాయి. సీజనల్ వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయి. కాబట్టి మీరు ఈరోజు నుంచే తినడం ప్రారంభంచాల్సిన కూరగాయలు కొన్ని ఉన్నాయి.

సొరకాయలను ఎంతోమంది ఇష్టపడరు. నిజానికి దీన్ని సరైన పద్ధతిలో వండితే చాలా రుచిగా కూరలు సిద్ధమవుతాయి. ఎండలు మండిపోతున్నప్పుడు ఉత్సాహంగా జీవించాలంటే సొరకాయ తినడం ఎంతో ముఖ్యం. నీటితో నిండిన ఈ కూరగాయ మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి త్వరగా జీర్ణం అయిపోతుంది. దీన...