Hyderabad, మార్చి 27 -- వేసవికాలం వచ్చేసింది. కాబట్టి ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తినే ఆహారం, పానీయాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో తేలికగా ఉన్న పోషకాహారాన్ని మాత్రమే తినాలి. వేసవికాలంలో ఎక్కువగా వచ్చే కూరగాయలు బెండకాయ, దోసకాయ, టమోటోలు వంటివి. వీటినే అధికంగా తింటూ ఉంటారు. అయితే వీటిని తినే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపై ఎక్కువగా పురుగుల మందులను చల్లుతారు. వీటిని సరిగా శుభ్రం చేసుకొని తినకపోతే పురుగుల మందులు శరీరంలో చేరే అవకాశం ఉంది.

బెండకాయ, దోసకాయ, టమోటోలను వండడానికి లేదా తినడానికి ముందు పరిశుభ్రంగా కడగాలి. టమోటోలను, దోసకాయను కొంతమంది పచ్చిగా తింటూ ఉంటారు. అలా తినేటప్పుడు దాన్ని పరిశుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. ఎందుకంటే వీటిపై మైనపు పొరను పూస్తారు. ఇవి మెరుస్తూ కనిపించ...