Hyderabad, మార్చి 11 -- అడవిలో తిరుగుతున్న సింహాలను, పులులను చూడాలన్న కోరిక ఎంతోమందికి ఉంటుంది. అలా అని అడివికి వెళ్లి చూసేంత ధైర్యం ఎవరికీ ఉండదు. అయితే గిర్ నేషనల్ పార్కులో జంగిల్ సఫారీకి వెళితే మీరు ఎంచక్కా ఆ అడవిలో తిరుగుతున్న పులులు. సింహాలను చూడవచ్చు. అలాగే మీరు సురక్షితంగా కూడా ఉండవచ్చు. ఈ వేసవి సెలవుల్లో గిరి నేషనల్ పార్క్ కు ఎలా వెళ్లాలో తెలుసుకోండి.

గిరి నేషనల్ పార్క్ గుజరాత్ లో ఉంది. మీరు విమానంలో వెళ్లాలనుకుంటే దీనికి దగ్గరగా ఉన్న విమానాశ్రయం రాజ్‌కోట్‌లోని కిషోర్ కుమార్ గాంధీ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గిర్ నేషనల్ పార్క్. అలాగే గిర్‌కి సమీప విమానాశ్రయం డయ్యూ విమానాశ్రయం కూడా. ఇది 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకున్నాక టాక్సీ లేదా బస్సులో గిర్ నేషనల్ పార్కుకు వెళ్ళవచ్చు. ఒకవేళ మ...