ఆంధ్రప్రదే,తెలంగాణ, మార్చి 21 -- ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి, సౌక‌ర్య‌వంత‌మైన ప్రయాణాన్ని అందించ‌డానికి ఏపీలోని పలు ప‌ట్ట‌ణాల మీదుగా స్పెష‌ల్ రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాలను పేర్కొంది. ఈ రైళ్లు చర్ల‌ప‌ల్లి నుంచి ఏపీలోని వివిధ రైల్వే స్టేష‌న్ల మీదుగా క‌న్యాకుమారికి రాక‌పోక‌ల నిర్వ‌హిస్తాయి. అలాగే మరో ఎనిమిది స్పెష‌ల్ రైళ్లను పొడిగించారు.

చ‌ర్లప‌ల్లి-క‌న్యాకుమారి స‌మ్మ‌ర్‌ స్పెష‌ల్ ట్రైన్ (07230) ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్ర‌తి బుధ‌వారం రాత్రి 9.50 గంట‌ల‌కు చ‌ర్ల‌పల్లి నుంచి బ‌య‌లుదేరుతుంది. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున 2.30 గంట‌ల‌కు క‌న్య‌కుమారి చేరుకుంటుంది.

క‌న్య‌కుమారి-చ‌ర్ల‌ప‌ల్లి స‌మ్మ‌ర్‌ స్పెష‌ల్ (07229) ట్రైన్ ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వ‌ర‌కు అందుబాట...