భారతదేశం, మే 6 -- వేడి కారణంగా అంత ఈజీగా నిద్ర రాదు. రాత్రి బెడ్ మీద ఒక పక్కన పడుకుంటే.. అటువైపు చెమటతో తడిసిపోతుంది. ఇది చికాకు కలిగిస్తుంది. మెలకువ వచ్చేలా చేస్తుంది. అందుకోసం చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. శరీరంలో అలసిపోతే బాగా నిద్రపడుతుంది. ఇంకా చాలా ఇళ్లలో ఏసీ లేదు. ఫలితంగా ఈ వేసవి రాత్రి హాయిగా నిద్రించడానికి సమస్యలే. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికీ తగినంత నిద్ర అవసరం. నిద్ర సరిగా లేకపోతే శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. బరువు ఇబ్బందులు కూడా చూస్తారు. రోజంతా అలసటగా అనిపిస్తుంది.

ఒత్తిడి తగ్గాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోని వారు చాలా మంది ఉన్నారు. ఫలితంగా మరుసటి రోజు పని చేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. గుర్తుంచుకోండి, రాత్రి నిద్రపోకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ...